యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య బ్యానర్లో నిర్మిస్తున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తూ ఉండటంతో దీనికి ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఎప్పుడో వచ్చేసింది. ఇక ‘బాహుబలి’తో రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన నేపథ్యంలో రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతకు భారీ ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ వర్గాలు సమాచారం.
RRR చిత్రానికి తాను ఎంతైనా పెడతానని చెప్పిన సదరు నిర్మాత, దానయ్య తప్పుకుంటే, రూ.100 కోట్లను ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. రాజమౌళి తదుపరి చిత్రం షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కానప్పటికీ, దీన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ బయ్యర్లు క్యూలో ఉన్నారు. ఇక దానయ్యకు నిర్మాత ఆఫర్ గురించిన విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇది నిజమేనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.