‘RRR’ అద్భుతం.. ప్రపంచంలోనే అతిపెద్ద తెరపై..

144
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రూపొందింది. అత్యంత భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం ప్రపంచంలోనే అతిపెద్ద తెరపై అవిష్కృతం కానుంది.

యూకేలో ఈ సినిమాను వెయ్యి స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. వాటిలో లండన్ లోని ఓడియన్ బీఫ్ ఐ ఐమ్యాక్స్ ఒకటి. ఇది యూకేలోనే అతి పెద్ద స్క్రీన్. ఈ తెరపై ‘ఆర్ ఆర్ ఆర్’ను చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఒక తెలుగు సినిమా ఈ తెరను ఆక్రమించడం గౌరవమే కాదు .. గర్వకారణం కూడా అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైనకొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.

- Advertisement -