ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ ఖరారు

16
- Advertisement -

ప్ర‌పంచం మొత్తంలో ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ చిత్రం తాలూకు ప్రభంజనమే. ఏ అవార్డుల ఫంక్ష‌న్ చూసినా ఆర్ఆర్ఆర్ చిత్ర బృంద‌మే. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ నామినేష‌న్స్‌కి కూడా ఎంపికైన విష‌యం తెలిసిందే. చిత్ర బృందం ఆల్రెడీ అమెరికాలోనే ఉండ‌గా, జూనియర్ ఎన్టీఆర్ కూడా వారితో త్వ‌ర‌లోనే క‌ల‌వ‌నున్నాడు. మార్చి 6వ తేదీ తెల్ల‌వారు ఝామున మూడు గంట‌ల‌కు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మరో గౌరవం దక్కనుంది.

ఆస్కార్ వేదికపై ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలో నాటు నాటు పాటను లైవ్‌లో పాడనున్నారు మన సింగర్స్. ఈనెల 12వ తేదీన జరగనున్న అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.. నాటు నాటు పాటను పాడి ప్రభంజనం సృష్టించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఆస్కార్‌‌ అవార్డుల కార్యక్రమంలో తెలుగు పాట పాడే అవకాశం దక్కించుకోవడం దేశానికి గర్వకారణం.

ఇప్పటికే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది అని టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ వేడుకలో సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ చేత ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ ప్రదర్శనకు ఆస్కార్ అకాడమీ అవకాశం కల్పించింది అని తెలుస్తోంది. మరి నిజంగానే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తే.. అది సరికొత్త రికార్డు అవుతుంది. ఇక ఈ అవకాశం పై రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. ‘నా జీవితంలో ఇది మరిచిపోలేని సందర్భం. ఆ క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.’ అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి…

విజయ్ తో శ్రీ లీల?

విద్యా దానంలో ప్రముఖ నటుడు!

ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ

- Advertisement -