ఆర్ఆర్ఆర్‌కు మరోసారి అవార్డుల పంట…

24
- Advertisement -

తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ క్రిటిక్ ఆసోసియేషన్ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. ఈ కేటగిరీల్లో ఒకేసారి నాలుగు అవార్డులు గెలుచుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ…ఎంతగానో శ్రమించి స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్ క్లైమాక్స్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కంపోజ్‌ చేసిన జుజీతో పాటు ఇతర స్టంట్స్ మాస్టర్స్‌కు కృతజ్ఞతలు. మా విజన్ అర్థం చేసుకొని మాకు అనుగుణంగా మారి…కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్స్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. సినీ ప్రియులకు అలరించడం కోసం స్టంట్స్‌ మాస్టర్స్ ఎంతో శ్రమిస్తుంటారు. కాబట్టి ఈ స సినిమాలోని రెండు మూడు షాట్స్‌లో మాత్రమే డూప్స్‌ని ఉపయోగించాం. మిగతావన్నీ ఎన్టీఆర్ రామ్‌చరణ్‌నే స్వయంగా చేశారు. వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు …సినిమా కోసం 320రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఇందులో ఎక్కువ భాగం స్టంట్స్‌ కోసమే పనిచేశాం. ఇది కేవలం నాకు నా చిత్రానికే కాదు మా భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు మా టాలెంట్‌ని గుర్తించిన హెచ్‌సీఏ వారికి మరోసారి కృతజ్ఞతలు. మేరా భారత్‌ మహాన్. జై హింద్ అని రాజమౌళి అన్నారు.

ఇవి కూడా చదవండి…

మహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు

పవన్ సినిమాలో శ్రీ లీల ?

- Advertisement -