- Advertisement -
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా ఈ సినిమాపై తన మార్క్ కామెంట్ చేశారు దర్శకుడు ఆర్జీవీ.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను….సర్కస్‌లా అనిపించింది. సర్కస్ అంటే నెగిటివ్ గా తీసుకోకండి. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో తనకు అలాంటి ఉత్సాహమే కలిగిందన్నారు.
ముఖ్యంగా సినిమాలో వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్‌లో బ్రిడ్జి మీద రామ్‌చరణ్, తారక్‌లు చేసిన సీన్లు చూస్తే చిన్నప్పుడు చూసిన జెమినీ సర్కస్ గుర్తొచ్చింది. ఆ సర్కస్ లో కూడా అలాంటి ఫీట్లే చేసేవారని తెలిపారు.
- Advertisement -