దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్వకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం. ఈ సినిమా నుంచి తాజా మొదటి సాంగ్ విడుదలైంది. ఆ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీన్ని విడుదల చేశారు. కీరవాణి అందించిన మ్యూజిక్ అదుర్స్ అనిపిస్తోంది. దోస్తీ అంటూ సాగుతోన్న ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. ఈ సినిమాలో హేమచంద్ర ఈ పాట పాడారు. ఈ పాట కోసం విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో చివరిగా ఈ సంగీత బృందంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనపడ్డారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ మధ్య దోస్తీ పాట ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని ఇటీవలే సినిమా యూనిట్ వివరించింది. అక్టోబర్ 13న ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేయనున్నారు.