RRR నుండి ఎత్త‌ర జెండా వీడియో సాంగ్ వచ్చేసింది..

173
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఎత్త‌ర జెండా వీడియో సాంగ్ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అలియాభట్‌, రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పై వ‌చ్చే ఈ పాట క‌ల‌ర్‌ఫుల్‌గా సాగుతూ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది.

ఈ మూవీ నుంచి ఇదివరకూ రిలీజైన పోస్టర్స్‌, మేకింగ్‌ వీడియోస్‌, టీజర్, ట్రైలర్‌, పాటలు రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి. దీంతో సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సాంగ్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తుండ‌గా..జూనియ‌ర్ ఎన్టీఆర్ కొమ్రం భీం రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ సీత పాత్ర‌లో న‌టిస్తోంది. హాలీవుడ్ బ్యూటీ ఒలివియో మొర్రీస్ మ‌రో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

- Advertisement -