ఓటీటీలో ఆర్ఆర్ఆర్ రికార్డు!

131
rrr
- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్ , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 25న పాన్ ఇండియా స్థాయిలోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లను రాబట్టింది.

ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ ను మే 20న నెట్‌ఫ్లిక్స్ లో, తెలుగుతో సహా ఇతర వెర్షన్స్‌ను జీ5 (Zee5) లోనూ స్ట్రీమింగ్ చేశారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఒక అరుదైన రికార్డును సాధించింది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యకాలంలో విడుదలైన ఆంగ్లేతర సినిమాల్లో ఆదరణ పరంగా నె0. 1 స్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 60 దేశాల్లో 18 మిలియన్ వాచ్ అవర్స్‌తో ట్రెండింగ్‌లో నిలిచిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకుంది.

- Advertisement -