ఓటీటీలోకి RRR డాక్యుమెంటరీ!

2
- Advertisement -

రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. డీవీవీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వచ్చిన ఈ చిత్రం ఈ సినిమా 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా మేకింగ్ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువ‌చ్చిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌- బిహైండ్‌ అండ్‌ బియాండ్‌ అంటూ వ‌చ్చిన ఈ డాక్యు ఇటీవ‌లే ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌ స్క్రీన్‌లలో విడుద‌లై మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ కొత్త‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీ ర‌న్ టైం 1 గంట 38 నిమిషాలు ఉంది.

Also Read:నేరెళ్లపల్లికి కేటీఆర్, హరీశ్‌

- Advertisement -