రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. ఓపెనర్ జోస్ బట్లర్ (60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 నాటౌట్) దుమ్మురేపే ఆటతీరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. సురేశ్ రైనా (35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధ సెంచరీ చేయగా వాట్సన్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), ధోనీ (23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 33 నాటౌట్) రాణించారు. ఆర్చర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన రాజస్థాన్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ప్రజల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు రాజస్థాన్ ఆటగాళ్లు గులాబీ జెర్సీతో బరిలోకి దిగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బట్లర్‌కు దక్కిం ది.
చెన్నై సూపర్‌కింగ్స్: వాట్సన్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 39; రాయుడు (బి) ఆర్చర్ 12; రైనా (సి) బన్నీ (బి) సోధి 52; ధోని నాటౌట్ 33; బిల్లింగ్స్ రనౌట్ 27; బ్రావో నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12. మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 176;
వికెట్ల పతనం: 1-19, 2-105, 3-119, 4-174;
బౌలింగ్: కె.గౌతమ్ 3-0-28-0; అంకిత్ శర్మ 1-0-11-0; ఆర్చర్ 4-0-42-2; స్టోక్స్ 4-0-31-0; ఉనద్కత్ 4-0-34-0; సోధి 4-0-29-1
రాజస్థాన్ రాయల్స్: బట్లర్ నాటౌట్ 95; స్టోక్స్ (బి) హర్భజన్ 11; రహానె (సి) రైనా (బి) జడేజా 4; శాంసన్ రనౌట్ 21; ప్రశాంత్ (సి) బ్రావో (బి) శార్దూల్ 8; బిన్నీ (సి) వాట్సన్ (బి) బ్రావో 22; గౌతమ్ (సి) ధోని (బి) విల్లీ 13; ఆర్చర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3;
మొత్తం : (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 177;
వికెట్ల పతనం: 1-48, 2-53, 3-99, 4-109, 5-146, 6-165;
బౌలింగ్: విల్లీ 4-0-47-1; హర్భజన్ 2-0-29-1; జడేజా 4-0-28-1; శార్దూల్ 4-0-22-1; కర్ణ్ శర్మ 1-0-10-0; బ్రావో 3.5-0-31-1; వాట్సన్ 1-0-9-0.