బిగ్‌బాస్‌ సన్నీపై దాడి!

204
sunny
- Advertisement -

బిగ్ బాస్‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు వీజే స‌న్నీ. ప్ర‌స్తుతం వ‌రుస సినిమా షూటింగ్‌ల‌తో స‌న్నీ బిజీగా ఉండ‌గా ఆయ‌న న‌టిస్తున్న ఏటీఎం అనే సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటుంది.

హస్తినాపురం ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుండ‌గా ఓ రౌడీషీటర్ సెట్‌కు వచ్చి హల్‌చల్‌ చేశాడు. హీరో సన్నీతో గొడవకు దిగి అత‌డిపై దాడి చేశాడు.

దీంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స‌న్నీ బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -