ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ జూన్ 18న గ్రాండ్ రిలీజ్

169
romantic
- Advertisement -

ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న ‘రొమాంటిక్’ మూవీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయ‌న శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కేతికా శ‌ర్మ హీరోయిన్. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రొమాంటిక్’ రిలీజ్ డేట్‌ను సోమ‌వారం స్టైల్‌గా అనౌన్స్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 18న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో టైటిల్‌కు న్యాయం చేస్తూ.. న‌డుస్తున్న బ‌స్ డోర్ ద‌గ్గ‌ర‌ హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక ముఖ్య పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రం ఇంటెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఇదివ‌ర‌కు రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ సాంగ్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రాగా, పోస్ట‌ర్స్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై సూప‌ర్బ్ బ‌జ్ వ‌చ్చింది.

తారాగ‌ణం:
ఆకాష్ పూరి, కేతికా శ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్‌, సున‌య‌న‌.

- Advertisement -