ప్రాంతీయ పార్టీలే కీలకం:కేరళ సీఎం

267
kcr vijayan
- Advertisement -

కేంద్రంలో బీజేపీ,కాంగ్రెస్‌లకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జరిగిన సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించిన పినరయి దేశ రాజకీయా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు.

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి చర్చలు జరుపుతామని ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

ఇక నిన్న దాదాపు గంటన్నర పాటు కేరళ సీఎంతో చర్చించారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ గురించి విజయన్‌కు వివరించారు సీఎం కేసీఆర్. దేశంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే అధికారంలో ఉన్నాయని, రెండుపార్టీలు కూడా రాష్ట్రాల అవసరాలను, అభ్యంతరాలను పట్టించుకోలేదని, వీలైనంతవరకు రాష్ట్రాలపై పెత్తనం చూపించేందుకు ప్రాధాన్యమిచ్చాయని చెప్పారు.

రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఎంతో ఉందని వెల్లడించారు. ఈ దిశగా కమ్యూనిస్టులు కలిసి రావాలని సూచించారు. కేసీఆర్ ప్రతిపాదనకు అంగీకరించిన విజయన్ పార్టీలో చర్చ జరిగేలా చూస్తానని చెప్పారు.

- Advertisement -