వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాను అవమానించడం, సర్వత్రా విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి రోజా.
ఇదేనా మీ దేశభక్తి, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ జాతీయ జెండాపై చెప్పులతో నడిచి అవమానించిన మీ వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ అంజనేయులు. శత్రువులు కూడా ఇలాగ చేయరేమో, కానీ ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు? చెప్పాలని మండిపడ్డారు.
ఇక ఈ ఘటనపై దేశ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు క్షమాపణలు చెప్పారు. అది అనుకోకుండా, చూసుకోకుండా జరిగిన తప్పని.. అయినా అందరూ క్షమించాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవీ ఆంజనేయులు.. ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు బరిలోకి దిగగా.. వైసీపీ అభ్యర్థిపై జీవీ ఆంజనేయులు గెలుపొంది.. వినుకొండ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు.
ఇదేనా మీ దేశభక్తి, @ncbn @naralokesh గారూ?
జాతీయ జెండాపై చెప్పులతో నడిచి అవమానించిన మీ వినుకొండ @JaiTDP ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ @gvanjanneylu! శత్రువులు కూడా ఇలాగ చేయరేమో, కానీ ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి ఇలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు?#IndependenceDay… pic.twitter.com/zS96v7wegg— Roja Selvamani (@RojaSelvamaniRK) August 15, 2025
Also Read:అలస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ..

