రాబోయేది జగనన్న ప్రభుత్వమే: రోజా

1
- Advertisement -

జగన్ ను మళ్లీ సీఎం ను చేసే వరకు ఈ పోరాటం ఆపను తేల్చి చెప్పారు మాజీ మంత్రి రోజా. మీడియాతో మాట్లాడిన రోజా..కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.మా నాయకులను, కార్యకర్తలను బెదిరించినా, వారి ఆస్తులు ధ్వంసం చేసినా మిమ్మల్ని వదిలిపెట్టం అన్నారు.

మళ్లీ రాబోయేది జగనన్న ప్రభుత్వమే…ప్రతి ఒక్కడికీ వడ్డీతో సహా ఇచ్చేస్తాం అన్నారు. అధికారంలోకి రాకముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడు…కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందన్నారు.

పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు,బెల్ట్ షాపులు పెడుతున్నారు…జగన్ కట్ అవుట్ కు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతుందని ఎద్దేవా చేశారు.

Also Read:ఇదేనా రేవంత్ తీసుకొచ్చిన మార్పు: కేటీఆర్

- Advertisement -