- Advertisement -
ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. ప్రజల్లో జగన్ పట్ల ఉన్న అచంచల విశ్వసనీయతే వైసీపీ గెలుపుకు బాటలు వేస్తుందన్నారు. పాదిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజా… మంచి చేసేవారికే తాము అండగా ఉంటామని ప్రజలు చెబుతున్నారన్నారు.
ఈ ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇదే అంటూ ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని తెలిపారు రోజా. తమ విశ్వశనీయతను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా తాము అభివృద్ధి పనులు చేపట్టామన్న రోజా.. ఎక్కడా వివక్షకు తావివ్వలేదన్నారు. చంద్రబాబు ఎన్ని అస్త్రాలు ప్రదర్శించినా అవన్నీ ఎన్నికల బరిలో తేలిపోయాయన్నారు.
Also Read:కేఎల్ రాహుల్ స్థానంలో శాంసన్!
- Advertisement -