పయ్యావుల-రోజా చిట్ చాట్…

323
roja payyavula

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకంది. అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా,టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరు కాసేపు ముచ్చటించారు.

రోజా ప్రసంగాల్లో మునుపటి ఫైర్ లేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభిప్రాయపడగా సభలో చంద్రబాబు లేకపోవడం వల్లే తన ప్రసంగంలో వాడి తగ్గిందని రోజా నవ్వులు పూయించారు. సభలో చంద్రబాబు ఉంటే ఆటోమెటిక్ గా తన స్పీచ్ ఫ్లో పెరుగుతుందని చెప్పారు. అదే సమయంలో పయ్యావులపై రోజా సరదాగా కామెంట్స్ చేశారు.

సభలో చంద్రబాబు లేని సమయం చూసి సీఎం జగన్‌ను పయ్యావుల పొగిడారని అనగా పయ్యావుల సైతం తనదైన శైలీలో సమాధానం చెప్పారు. తమ పార్టీ తీసుకురావాలనుకొన్న బిల్లును తెచ్చినందునే తాను ఆ రకంగా మాట్లాడానని చెప్పడంతో పాటు రోజా మౌనం వెనుక మరేదైనా కారణం ఉండి ఉండొచ్చన్నారు.