రోజాకు పోటిగా రమ్యకృష్ణ

533
roja
- Advertisement -

కామెడీ షోలకు ఈ మధ్య బాగా ఆధరణ పెరిగింది. ప్రేక్షకులు ఎక్కువగా కాసేపు నవ్వించే ప్రోగ్రామ్‌ లకే ఎక్కువ ప్రీపరెన్స్ ఇస్తున్నారు. దీంతో ఎంటర్‌టైన్ మెంట్ ఛానల్స్‌ కామెడీ షో పై ఫోకస్ పెట్టాయి. కొత్త కొత్త కామెడీ షోలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మా టీవి అలాంటి ప్రయత్నమే చేస్తోంది. తెలుగునాట పాపులర్ అయిన జబర్దస్ట్ ప్రోగామ్‌కు ధీటుగా మరో ప్రోగ్రామ్‌ రాబోతుంది. కేవలం.. జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్‌దస్త్‌ షోస్ కారణంగానే ఈటీవీ తన రేటింగ్‌ ను భారీగా పెంచుకోగలింది. దీంతో మా టీవీ కూడా ఇలాంటి ప్రయోగానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే గ్రౌండ వర్క్‌ చేయడంతో… జడ్జీలుగా… ఎవరిని పెట్టాలనే ఆలోచనలో పలువురిని సంప్రదించారట.

roja
మొదట ఈ ప్రోగ్రామ్‌కు జీవిత, రాజశేఖర్‌ ను జడ్జ్‌గా ఎంపిక చేయలనుకున్నారట…కానీ అది ఫైనల్ కాలేదు. అలా కొంతమందిని పరిశీలించి చేసి చివరికి పోసాని కృష్ణమురళీ, రమ్యకృష్ణను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. నాగార్జునకు, చిరంజీవికి ఇంకా మాటీవీలో షేర్లు వుండడంతోనే ఈ ప్రోగ్రామ్ కోసం కసరత్తు జరుగుతోందట. ఈ ప్రోగ్రామ్ కోసం మంచి టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జబర్‌దస్త్‌లో తరహా స్కిట్లు కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండాలని షో నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. మరీ ఈ ప్రోగ్రామ్ జబర్దస్త్ ను బీట్ చేస్తుందా లేదో చూడాలి.

- Advertisement -