టీ20లకు గడ్‌బై చెప్పిన కోహ్లీ,రోహిత్

189
- Advertisement -

అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను సాధించిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇదే నా చివరి మ్యాచ్‌. వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా. అనుకున్నది సాధించా. టీ20 కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా అని రోహిత్ వెల్లడించాడు. ’ అని హిట్‌మ్యాన్‌ అన్నాడు.

ఇది నా కెరీర్‌లో చివరి టీ20 ప్రపంచకప్‌. ఏదైతే సాధించాలనుకున్నామో అది అందుకున్నాం. భారత్‌ తరఫున టీ20ల్లో ఇదే చివరి మ్యాచ్‌. ఇందులో ఎలాంటి రహస్యం లేదు అని చెప్పారు. టీ20లను ముందుకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ ట్రోఫీ కోసం ఏండ్లుగా ఎదురుచూశాం. రోహిత్‌కు ఇది తొమ్మిదో టీ20 ప్రపంచకప్‌ అయితే..నాకిది ఆరోది అని తెలిపారు. ఈ మ్యాచ్‌ చిరకాలం మా మదిలో నిలిచిపోతుందని తెలిపారు. ఇక ఫైనల్లో రాణించిన విరాట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:టీ20 విజేతగా టీమిండియా

- Advertisement -