ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరే ముందు, రోహిత్ శర్మ తన దీర్ఘకాల మెంటార్ అభిషేక్ నాయక్తో కలిసి ముంబైలో తీవ్రంగా శిక్షణ పొందారు. ఈ సమయంలో రోహిత్ బరువు తగ్గి కనిపించాడు.
భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో, రోహిత్ తన బరువు తగ్గించాలని నిర్ణయించుకున్న క్షణాన్ని వివరించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్టోబర్ 19న పర్థ్‌లోని ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కి తిరిగి రాబోతున్నారు.
ఇటీవలి కాలంలో రోహిత్ తన అద్భుతమైన శారీరక మార్పుతో వార్తల్లో నిలిచారు. ఆయన బరువు తగ్గి, చురుకుదనం పెరిగి, మైదానంలో ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఆయన బరువు పెరిగారని చాలా మంది మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అప్పుడు ఆయనకు ఇది మార్పు అవసరమని అనిపించింది. ఆరోగ్యంగా, వేగంగా, మరింత ఫిట్‌గా మారటమే ఆయన లక్ష్యం. అందుకే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రారంభమైంది అని చెప్పారు.
Silenced every doubt with discipline and sweat! 💯🫡@ImRo45‘s commitment levels are truly commendable! 👌🏻
WATCH HIM 👉 AUS 🆚 IND | 1st ODI | SUN, 19th OCT, 8 AM
[Rohit Sharma, Indian Cricket Team, Abhishek Nayar pic.twitter.com/DRevh26Ua2
— Star Sports (@StarSportsIndia) October 16, 2025

