IND vs ENG : వరల్డ్ రికార్డ్ కు దగ్గర్లో రోహిత్?

32
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ మధ్య మరో రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇరు జట్ల మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ పై గట్టిగానే కన్నేశాయి. వరుసగా రెండు, మూడు టెస్టులలో గెలిచిన టీమిండియా ఈ నాలుగో టెస్టులో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అటు ఇంగ్లీష్ జట్టు కూడా సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో డూ ఆర్ డై లా మారింది. దాంతో ఈ నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఇక ఇరు జట్లలో ప్లేయింగ్ ఏలెవన్ కొద్దిగా మార్పులు కనిపించే అవకాశం ఉంది. .

ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే తుది ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.. మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్ ఇద్దరికి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో రాబిన్సన్, సోయబ్ బషీర్ లను బరిలోకి దించింది. ఇక టీమిండియా విషయానికొస్తే జట్టులో ప్రధానమైన మార్పులు పెద్దగా కనిపించే అవకాశం లేదు. కే‌ఎల్ రాహుల్ జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని భావించినప్పటికి, ఇంకా ఫిట్ నెస్ లోపంలో రాహుల్ బాధపడుతున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దాంతో మూడో టెస్టులో రాణించిన జట్టునే సెలక్టర్లు ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో ముఖేష్ కుమార్ లేదా ఆకాశ్ దీప్ లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట.

రికార్డులకు దగ్గర్లో హిట్ మ్యాన్
ఇక ఈ టెస్టు మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డులు ఉరిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో 600 సిక్సులు మార్క్ అందుకునేందుకు హిట్ మ్యాన్ 7 సిక్సుల దూరంలో ఉన్నాడు. ఒకవేళ ఈ టెస్టు మ్యాచ్ లో ఆ ఘనత సాధిస్తే మూడు ఫార్మాట్ లలో కలిపి 600 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. అలాగే టెస్టుల్లో 4000 పరుగులు చేరుకునేందుకు కేవలం 23 పరుగుల దూరంలో ఉన్నాడు. మరి ఈ టెస్టు మ్యాచ్ తో రోహిత్ ఈ రెండు రికార్డులను అందుకుంటాడేమో చూడాలి.

Also Read:కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి..కేసీఆర్ సంతాపం

- Advertisement -