వచ్చె నెల నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. భారత్-శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుండగా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్ కప్‌లో తాను పాల్గొన్నందున, ఈసారి ఇంటి నుంచే టీ20 వరల్డ్ కప్ చూడటం వింతగా అనిపిస్తుందని తెలిపారు.
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోవడం తనకు పెద్దగా మిస్‌గా అనిపించకపోయినా, వరల్డ్ కప్ అనుభవం మాత్రం చాలా మిస్ అవుతున్నానని అన్నారు. అయితే కొన్ని మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలని కూడా రోహిత్ భావిస్తున్నట్లు చెప్పారు.
2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. తదుపరి ఎడిషన్ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రతి ఎడిషన్‌లో తాను ఆడిన అనుభవం ఉన్నందున ఈసారి వరల్డ్ కప్‌కు దూరంగా ఉండటం వింతగా అనిపిస్తుందని రోహిత్ అంగీకరించారు.
38 ఏళ్ల రోహిత్ మాట్లాడుతూ, టీ20ఐలు ఆడకపోవడం తనకు పెద్దగా బాధగా అనిపించదని, కానీ వరల్డ్ కప్ అనుభవం మాత్రం పూర్తిగా భిన్నమని, దాన్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పారు. కొన్ని మ్యాచ్‌లకు స్టేడియానికి వెళ్లాలని భావిస్తున్నానని, ఈ టోర్నీ ఎంతో అద్భుతంగా ఉంటుందని కూడా తెలిపారు.
Also Read:మేడారం..హెలికాప్టర్ రైడ్స్ షురూ

