కోలుకున్న రోహిత్‌… టీ20కి రెడీ

52
rohith
- Advertisement -


కెప్టెన్‌ అయ్యాక తొలి విదేశి పర్యటనకు వెళ్లిన రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డారు. దీంతో అయన ఎడ్జ్ బాస్టన్‌ టెస్టుకు దూరమయ్యారు. గత గురువారం నిర్వహించిన రెండో కరోనా పరీక్షలో రోహిత్‌కు నెగిటివ్‌ వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అతడు ఇండియా-ఇంగ్లాడ్‌ టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడని సమాచారం. లీస్టర్‌‌షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్ సందర్భంగా రోహిత్‌ పాజిటివ్ అని తేలడంతో అతడు మూడో రోజు నుంచి గ్రౌండుకు రాలేదు. ఐసోలేషన్‌లోనే గడిపిన హిట్టర్‌…ఆదివారం క్వారంటైన్‌ నుంచి బయటకు వస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రోహిత్ గైర్హాజరీతో యువ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా కు భాధ్యతలు అప్పజేప్పారు. రోహిత్ జులై 7 నుంచి జరుగబోయే టీ20 సిరీస్‌కు మాత్రం అందుబాటులో రానున్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇటీవలే ఐర్లాండ్‌ సిరీస్‌లో ఆడిన జూనియర్ జట్టే ఇంగ్లండ్‌తో తొలి టీ20 ఆడుతుంది. వీరికి రోహిత్ శర్మ ఒక్కడే అదనంగా కలుస్తాడు. ఆ తర్వాత రెండు మ్యాచులకు మాత్రం భారత సీనియర్లు విరాట్ కోహ్లి, బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు జతకలుస్తారు. ఇంగ్లండ్‌తో జులై 7, 9, 10 లలో టీ20లు.. 12, 14, 17న మూడు వన్డేలు ఆడుతుంది రోహిత్ సేన.

- Advertisement -