ఈ నెల 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభంకానుంది. అయితే ఈ సారి ఈ టోర్నిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా భారత జట్టులోని దాదాపు అన్ని స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొననున్న నేపథ్యంలో అందరి దృష్టి దీనిపైనే ఉంది. అయితే, ఈ ఇద్దరు దిగ్గజాలు చివరిసారిగా దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఎప్పుడు ఆడారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.
బీసీసీఐ సూచనల మేరకు ఫిట్‌గా ఉన్న జాతీయ జట్టు ఆటగాళ్లందరూ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించబడింది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొంతకాలంగా ఈ టోర్నీలో పాల్గొనలేదు.
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో చివరిసారిగా 2009–10 సీజన్‌లో ఢిల్లీ జట్టు తరఫున ఆడారు. ఆ సీజన్‌లో ఆయన జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఐదు మ్యాచ్‌లలో 229 పరుగులు సాధించిన కోహ్లీ, సగటు 45.8, స్ట్రైక్‌రేట్ 102.23తో ఆకట్టుకున్నారు.
రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో చివరిసారిగా అక్టోబర్ 2018లో ముంబయి జట్టు తరఫున క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడారు. బిహార్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 70 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆయన అవుట్ కాకుండా 33 పరుగులు చేశారు. సెమీఫైనల్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 17 పరుగులకే అవుట్ అయ్యారు.
Also Read:మాస్ అవతారంలో విజయ్..’రౌడీ జనార్ధన’
రోహిత్ శర్మ ఈ సీజన్‌లో డిసెంబర్ 24, 26 తేదీల్లో సిక్కిం, ఉత్తరాఖండ్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌లలో ముంబయి తరఫున ఆడే అవకాశం ఉందని సమాచారం.

