Rohit:స్టార్ స్పోర్ట్స్‌పై అసహనం

29
- Advertisement -

ముంబై ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ టీవీ రైట్స్‌ దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా స్పందించిన రోహిత్.. మేం మా సహచరులు, స్నేహితులతో ట్రైనింగ్‌ క్యాంప్స్‌, మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు మాట్లాడుకున్న ప్రతి సంభాషణను కెమెరాలు రికార్డు చేస్తుండటం క్రికెటర్ల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తుందన్నారు.

నా సంభాషణను రికార్డు చేయొద్దని స్టార్‌ స్పోర్ట్స్‌ని కోరినా వాళ్లు దానిని ప్రసారం చేశారు. ఇది మా గోప్యతకు భంగం కలిగించేదే. ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌, వ్యూస్‌ పై మాత్రమే దృష్టి సారించి ఇలా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ట్వీట్ ద్వారా వెల్లడించారు.

Also Read:Harishrao:కుప్పకూలిన టీ డయాగ్నొస్టిక్స్‌

- Advertisement -