రోహిత్ శర్మ…విధ్వంసక ఓపెనర్. క్రిజ్‌లో నిలబడితే ప్రత్యర్ధి జట్టుకు చుక్కలే. గ్రౌండ్ నలువైపులా బంతిని పరుగెత్తించడంలో రోహిత్ స్టైలే వేరు. అయితే, ఇదంతా సఫారీ సిరీస్‌కు ముందు. ప్రస్తుతం రోహిత్ పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నాడు. టెస్టు,వన్డే సిరీస్‌లో రోహిత్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తగా తాజాగా టీ20లో సిరీస్‌లో చెత్త రికార్డును నమోదుచేశాడు.
అంతర్జాతీయ టీ-20ల్లో భారత్ తరపున అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో అతను నెంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో బుధవారం సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో రోహిత్ తొలి బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. ఇప్పటివరకు అతను అసలు పరుగులేమీ చేయకుండానే నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. రోహిత్ తర్వాతి స్థానాల్లో యూసుఫ్ పఠాన్ (3 సార్లు), ఆశిష్ నెహ్రా (3 సార్లు) ఉన్నారు.
రెండో టీ 20లో దక్షిణాఫ్రికా విజయంతో సిరీస్ సమం కాగా శనివారం జరిగే మూడో టీ20 కీలకంగా మారింది.