ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ. మార్చి 22 నుండి ఐపీఎల్ ప్రారంభం కానుండగా కాసింత గ్యాప్ దొరకడంతో రోహిత్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముంబై ఇండియన్స్ తమ IPL 2025 తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నై ఆడనుంది. ఇక తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని చాలా ఊహాగానాలు వచ్చినా, తన ప్రస్థానం ఇంకా కొనసాగుతుందని రోహిత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నా లక్ష్యం మంచి ఆటతీరు కనబరిచేలా ప్రయత్నించడం. నేను 2027 ప్రపంచ కప్ ఆడతానా లేదా అనే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని వెల్లడించారు రోహిత్. ఇక గత ఐపీఎల్ లో 10వ స్థానానికి పరిమితమైంది ముంబై.
Also Read:IPL 2025: టీమ్స్… కెప్టెన్స్ వివరాలివే