‘రాబిన్‌హుడ్’ …ఫస్ట్ సింగిల్

3
- Advertisement -

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటివలే రిలీజ్ చేసిన అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించబోతున్నారు. ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైం సాంగ్ ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో నితిన్, శ్రీలీల వైబ్రెంట్ అండ్ స్టయిలీస్ లుక్ లో కనిపించారు. పోస్టర్ లో డైనమిక్ డ్యాన్స్ మూమెంట్ వెరీ ఎట్రాక్టివ్ గా వుంది.

ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. ఎంటర్ టైనింగ్ అడ్వంచర్ ‘రాబిన్‌హుడ్’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.

Also Read:మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు

- Advertisement -