జ్యువెల్లరీ షాపులో చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకున్నాడు షాప్ యజమాని. ఈ ఘటన ఢిల్లీలోని టిగ్రీలో ప్రాంతంలో చోటుచేసుకుంది. అసలు విషయానికి వస్తే ఓ వ్యక్తి జ్యువెలరీ షాపుకి కస్టమర్లా వచ్చి, ఆ షాప్ యజమానితో జ్యువెలర్స్ గురించి ఆరా తీస్తూ.. ఒక్కసారిగా స్ప్రే బాటిల్ తో యజమానిపై స్ప్రే కొట్టాడు. వెంటనే యజమాని పక్కన ఉన్న ఓ వ్యక్తి ఆ దొంగను
అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా … అతనిపై కూడా స్ప్రే కొట్టాడు. ఆ వ్యక్తి వెంటనే బయటికి వెళ్లి అందరిని అప్రమత్తం చేశాడు.
కానీ షాప్ యజమాని మాత్రం దొంగను అస్సలు విడిచిపెట్టలేదు. ఆ దొంగ ఎన్నిసార్లు స్ప్రే కొడుతున్నా ముఖానికి తగలకుండా తల కిందికి పెట్టి దుండగుడిని పట్టుకున్నాడు. ఆ దొంగ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా… ఆ యజమాని మాత్రం విడిచిపెట్టలేదు. ఇంతలో బయటికి వెళ్లిన వ్యక్తి అందరిని అప్రమత్తం చేసి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ
సంఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యజమాని సాహసానికి నెటిజన్లు సాహో అంటున్నారు. మీరు వీడియోపై ఓ లుక్కెయ్యండి.