వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి

3
- Advertisement -

వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి చెందాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్- ప్రతిమ దంపతులకు కుమారుడు అర్షిద్ అష్రిత్ (21). వియత్నాం దేశంలోని కాంతో సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

అయితే నిన్న తెల్లవారుజామున స్నేహితుడితో 150 సీసీ బైక్ పై వెళ్తూ అతి వేగంగా ఒక ఇంటి గోడను ఢీ కొట్టాడు అష్రిత్. దీంతో అష్రిత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ

- Advertisement -