అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా బోల్తా పడింది టూరిస్ట్ బస్సు. న్యూయార్క్ లోని పెంబ్రోక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది టూరిస్టులు ఉన్నారు.
మృతుల్లో భారతదేశం, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన పర్యాటకులు ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. అయితే, తొలుత ఒక బాలుడు మరణించాడని తెలిపిన పోలీసులు తరువాత ఆ సమాచారం తప్పు అని స్పష్టం చేశారు. రక్షణ చర్యల కోసం అనేక అంబులెన్సులు, మెడికల్ హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ మాట్లాడుతూ ప్రమాదంలో చిక్కుకున్న వారందరికీ సహాయం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఘటనలో గాయపడిన 24 మంది పెద్దలను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. వారందరూ పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. చిన్నారులను ప్రత్యేకంగా పిల్లల ఆసుపత్రులకు తరలించారు.
Also Read:సీపీఐ నేత సురవరం ఇకలేరు..

