ఏపీలో RMZ గ్రూప్..భారీ పెట్టుబడులు

4
- Advertisement -

దావోస్ వేదికగా జరుగుతున్న #WEF2026లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు ప్రకటించింది ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ RMZ గ్రూప్. మొత్తం 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రాష్ట్రంలో పలు భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు RMZ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదిరాయి.

విశాఖ నగర శివార్లలోని కాపులుప్పాడలో 50 ఎకరాల్లో అత్యాధునిక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) పార్క్ ఏర్పాటు చేసేందుకు RMZ గ్రూప్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇది ఐటీ, డిజిటల్ సేవలు, ఇంజినీరింగ్, ఏఐ రంగాలకు కేంద్రంగా మారనుంది. అదేవిధంగా విశాఖలోనే 500 నుంచి 700 ఎకరాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు మరో కీలక ఒప్పందం జరిగింది. ఇది డేటా స్టోరేజ్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు బలమైన పునాది వేయనుంది.

ఇటు రాయలసీమలోని టేకులోడులో సుమారు 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ మరియు లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కూడా RMZ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టులతో పరిశ్రమలు, సరఫరా గొలుసు వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

ఈ మూడు ప్రధాన ప్రాజెక్టుల ద్వారా దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీని ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

Also Read:ఓం శాంతి శాంతి శాంతిః.. ఫన్ డ్రామా!

- Advertisement -