అలనాటి నటి మున్‌మున్ సేన్ కుమార్తె, బాలీవుడ్ నటి రియా సేన్ రహస్యంగా వివాహం చేసుకుంది. కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్ శివమ్ తివారీలు ప్రేమించుకుంటున్నారు.డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
కానీ ఇంతలోనే ఎవ్వరికీ తెలీకుండా బుధవారం పుణెలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వివాహం చేసేసుకున్నారు. కాగా, రియా గర్భవతి కావడంతోనే, ఆమె కుటుంబీకులు హడావుడిగా ఈ రహస్య వివాహాన్ని జరిపించినట్టు బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది.
మంచు మనోజ్ హీరోగా నటించిన ”నేను మీకు తెలుసా” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బాలీవుడ్ హాట్ భామ.
ఇక ”విష కన్య” (1991) సినిమాతో బాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, మలయాళం, తమిళ, బెంగాలీ సినిమాల్లో నటించింది. ఆమె సోదరి రైమా తెలుగులో నితిన్ హీరోగా నటించిన ‘ధైర్యం’లో తళుక్కుమన్న సంగతి విదితమే.