సందీప్ కిషన్ ‘మజాకా’లో రీతూ వర్మ

1
- Advertisement -

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనర్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. 20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో యాక్షన్ బ్లాక్స్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తాజాగా మజాకా మేకర్స్ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్- రీతూ వర్మల హ్యుమరస్ అనౌన్స్మెంట్ వీడియో ఆకట్టుకుంది. సందీప్, రీతూ వర్మల మధ్య లైట్ హార్ట్టెడ్ మూమెంట్స్ ని చూస్తోంది. రీతు పెళ్లి దుస్తులలో అందంగా కనిపించింది.

సందీప్ కిషన్, రీతూ వర్మ తమ డైనమిక్ తమ డైనమిక్ పెర్ఫార్మెన్స్‌లతో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించబోతున్నారు.

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో సక్సెస్ ఫుల్ అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది.ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

- Advertisement -