IND vs SA:చరిత్ర సృష్టించిన పంత్

7
- Advertisement -

భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తూ రిషబ్ పంత్ శనివారం చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టును నడిపిన రెండో వికెట్‌కీపర్‌గా అతను తన పేరును చరిత్రలో చెరగని స్థానం సంపాదించాడు. సాధారణ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా తప్పుకోవడంతో పంత్ గువాహటిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

28 ఏళ్ల పంత్ తన 48వ టెస్ట్ ఆడుతున్న ఈ సందర్భంగా భారత టెస్ట్ చరిత్రలో 38వ కెప్టెన్‌గా నిలిచాడు. అతడికి ముందు వికెట్‌కీపర్‌గా భారత టెస్ట్ జట్టును నడిపింది MS ధోనీ మాత్రమే. ధోనీ 2008 నుంచి 2014 వరకు మొత్తం 60 టెస్ట్‌లలో భారత్‌కు నాయకత్వం వహించాడు.

మ్యాచ్‌కి ముందుగా మాట్లాడుతూ పంత్, ఇది అసాధారణ పరిస్థితుల్లో వచ్చిన అవకాశమని, కానీ ఈ బాధ్యత తనకు లభించడం గర్వకారణమని తెలిపాడు. ఒక్క మ్యాచ్‌కి కెప్టెన్‌గా అవకాశం రావడం సరైన పరిస్థితి కాదు. కానీ అదే సమయంలో, బీసీసీఐ నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది. మీ దేశాన్ని నడిపించడం ఎప్పటికీ అత్యంత గౌరవమైన క్షణం అని చెప్పాడు.

పంత్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్ టాస్ వద్దే నిరాశతో ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి — గిల్, అక్షర్ పటేల్‌ల స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుధర్షన్ జట్టులోకి వచ్చారు.

దక్షిణాఫ్రికా (Playing XI)

ఐడెన్ మార్క్రమ్

రియాన్ రికెల్టన్

వియాన్ ముల్డర్

టెంబా బవుమా (కెప్టెన్)

టోనీ డి జోర్జీ

ట్రిస్టన్ స్టబ్్స్

కైల్ వెర్రెన్నే (వికెట్‌కీపర్)

మార్గో జాన్సన్

సెనురాన్ ముత్తుసామీ

సైమన్ హర్మర్

కేశవ్ మహారాజ్

Also Read:TTD:గజ వాహనంపై పద్మావతి అమ్మవారు

భారత్ (Playing XI)

KL రాహుల్

యశస్వి జైస్వాల్

సాయి సుధర్షన్

ధ్రువ్ జురేల్

రిషభ్ పంత్ (వికెట్‌కీపర్/కెప్టెన్)

రవీంద్ర జడేజా

నితీష్ కుమార్ రెడ్డి

వాషింగ్టన్ సుందర్

కుల్దీప్ యాదవ్

జస్ప్రీత్ బుమ్రా

మహమ్మద్ సిరాజ్

- Advertisement -