ప్రపంచరికార్డు సమం చేసిన పంత్…

178
panth
- Advertisement -

ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. అడిలైడ్‌ టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఆసీస్‌పై చారిత్రక విజయం నమోదు చేసింది. 11 ఏళ్ల తర్వాత కంగరూ గడ్డపై టెస్టు విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన పలు రికార్డులను నమోదుచేసింది.

చివరిసారిగా 2008లో పెర్త్‌లో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేగాదు ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ సైతం సరికొత్త రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌(6),సెకండ్ ఇన్నింగ్స్‌ (5)క్యాచ్‌లతో మొత్తం 11 క్యాచ్‌లను పట్టి ప్రపంచరికార్డును సమం చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు డివిలియర్స్,జాక్ రస్సెల్స్ పేరిట ఉంది.

india vs westindies

భారత్‌ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌ 291 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, షమి తలో మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

- Advertisement -