టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మూడు ఐసీసీ కప్పు లు అందించిన ఏకైక కెప్టెన్. సారథ్యంలో వేరెవరికీ అంతుచిక్కని వ్యూహాలు అమలు చేస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ధోని తరువాతే ఎవరైనా. కేవలం నాయకత్వంలోనే కాకుండా కీలక సమయాల్లో తన బ్యాటింగ్ తో కూడా జట్టుకు చిరస్మరణీయ విజయాలు ఎన్నో అందించాడు. ఇక తన కీపింగ్ స్కిల్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే. సెకన్ల వేగంలో వికెట్లను గిరాటేయడం ఒక్క ధోనికి మాత్రమే సాధ్యం. ఇలా ఆయా విభాగాల్లో ధోని స్థానం క్రీడా అభిమానుల్లో ఎప్పటికీ అలాగే ఉంటుంది. అయితే ప్రస్తుతం టీమిండియాలో యంగ్ ప్లేయర్స్ ధోనీ స్థానాన్ని చేరుకునేందుకు గట్టిగానే కష్ట పడుతున్నారు. .
ఆ కోవలో రింకూ సింగ్, ధృవ్ జూరెల్.. వంటి ఆటగాళ్లు ముందున్నారు. మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేస్తూ కీలక సమయాల్లో జట్టును తన ఇన్నింగ్స్ తో ఆడుకుంటున్నాడు రింకూ సింగ్.. జట్టు కష్టకాలంలో ఉన్నప్పటికి ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తూ ధోనిని గుర్తు చేస్తున్నాడు. ముందు రోజుల్లో రింకూ సింగ్ బెస్ట్ ఫినిషర్ గా ఎదిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తన కీపింగ్ స్కిల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు దృవ్ జూరెల్. అంతే కాకుండా నాలుగో టెస్టులో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో అటు కింపింగ్ లోనూ అటు బ్యాటింగ్ లోనూ దృవ్ రాణిస్తుండడంతో ధోని స్థానానికి చేరుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రస్తుతం యువ జట్టుతో కళకళలాడుతున్న టీమిండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో చూడాలి.
Also Read:తెలుగు టైటాన్స్ ఘనవిజయం..