రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

4
- Advertisement -

భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ గ్రేటర్ నోయిడాలోని యాతరత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం అత్యంత విషమించడంతో వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచారు. వైద్యులు నిరంతర రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ అందిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆరోగ్యం వేగంగా క్షీణించింది.

ఈ వార్త రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టుతో ఉన్న సమయంలో వచ్చింది. జింబాబ్వేతో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌కు ముందు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందడంతో వెంటనే స్వదేశానికి బయలుదేరారు.

Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!

తండ్రిని కలిసి తిరిగి జట్టులో చేరినా, జింబాబ్వే మ్యాచ్‌లో ఆయనను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టులో మార్పులు చేసి సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా తీసుకున్నారు. అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చారు.

మిగిలిన టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లకు రింకూ అందుబాటులో ఉంటారా అన్నది ఇంకా స్పష్టత లేదు.

- Advertisement -