ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌…

498
rice millers association
- Advertisement -

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలిపారు అధ్యక్షుడు నాగేందర్‌. సీఎం నాయకత్వంలో గడిచిన ఆరు సంవత్సరాల్లో రాష్ట్రంలో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో సాగు విస్తీర్ణం పెరిగి పంట దిగుబడి పెరుగుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వలన నీళ్లు సంవృద్ధిగా ఉండడంతో వరి పంట దిగుబడి పెరిగింది. పౌరసరఫరాల శాఖ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15లో పౌరసరఫరాల శాఖ 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే గత ఏడాది (2018-19)లో 77 లక్షలకు చేరిందన్నారు.

ఇదంతా ముఖ్యమంత్రి కృషి, పట్టుదలతో సాధ్యమైంది. ధాన్యం దిగుబడి పెరగడంతో మాకు ఉపాధి పెరిగింది. సంవత్సరంలో 365 రోజులు మా మిల్లులు పనిచేస్తున్నాయి. గతంలో కరెంటు కోసం ఎదురుచూసే వాళ్లం. రోజుకు 5, 6 గంటలకు మించి మిల్లులు నడిచేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చేతినిండా పని లభించిందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 2600 రైసు మిల్లులు ఉన్నాయి. వేలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మిల్లులు మూతపడ్డాయి. ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. గడిచిన రెండు, మూడు ఏళ్లలో రాష్ట్రంలో 300 నుంచి 400ల దాకా మిల్లులు కొత్తగా ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చర్యలతో ఈ రంగానికి ప్రాధాన్యత పెరిగింది. కొత్త మిల్లులు వస్తున్నాయని చెప్పారు.

తమకు ఇంత బాగా ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రికి రైసు మిల్లర్లు ఎప్పటికీ రుణపడి ఉంటాంమని చెప్పారు. ఆయన పుట్టిన రోజున కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించి కృతజ్ఞతలు చాటుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక హరితహారం కార్యక్రమాన్ని ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 2600 రైస్ మిల్లుల్లో ఒక్కో మిల్లులో విధిగా 10 నుండి 15 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకొంటాం. అలాగే ప్రతి జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆవరణలో కూడా మొక్కలు నాటుతాం అన్నారు.

అన్ని ప్రభుత్వం ఆసుపత్రుల్లో, జైళ్లల్లో పండ్ల పంపిణీ చేస్తాం అని తెలిపిన నాగేందర్…అలాగే జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నారు. ఎంత చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఋణం తీసుకోలేము…మంత్రి కేటీఆర్ కృషి తో పరిశ్రమలు క్యూ కడుతున్నాయని చెప్పారు. 24 గంటల కరెంట్ వలన మా పరిశ్రమ లాభాల బాటలో నడుస్తోంది..మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నాం ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.

- Advertisement -