జనవరిలో ఆర్జీవీ..లక్ష్మీస్ ఎన్టీఆర్..!

353
RGV laxmis NTR
- Advertisement -

లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు బయోపిక్‌పై ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చేశాడు వివాదస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో అందరి అటెన్షన్ కొట్టేసిన వర్మ.. దసరా సందర్భంగా సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తానని ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు(జనవరి 9న కథానాయకుడు,జనవరి 24న మహానాయకుడు) విడుదల కానుండగా వర్మ సైతం జనవరిలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల చేయనున్నట్లు ప్రకటించి హీట్ పెంచేశారు.

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయ్యాక తన కథ మొదలవుతుందని ..ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త బాలగిరి.. జీవీ ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిపారు. సినిమా ముహుర్తపు షాట్‌కు మీరు ఉహించని గెస్ట్ రాబోతున్నారని చెప్పారు.

- Advertisement -