చిన్నమ్మ గదికి అమ్మ ఆత్మ…

179
RGV unveils poster of his Sashikala
- Advertisement -

తమిళనాట నెలకొన్న రాజకీయ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన ట్విట్స్ చేశాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పరప్పన జైలులో శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళను డాన్‌గా అభివర్ణించాడు. జయలలిత,శశికళ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించిన వర్మ ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టాడు.

ఈ నేపథ్యంలో వర్మ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. జయలలిత ఆత్మ శశికళ ఉన్న జైలుగదిలోకి వస్తుందన్న గట్టి ఫీలింగ్‌ నాకుందని … జయలలిత, శశికళ బంధం వెనుక ఉన్న నిజాల గురించి పొయెస్‌ గార్డెన్‌లో పనిచేసిన కొంతమంది నాకు చెప్పిన విషయాలు నిర్ఘాంతపరిచాయని వర్మ ట్విట్ చేశౄరు. వాటన్నింటిని నా సినిమాలో చూపిస్తానని స్పష్టం చేశారు. ఇక  పళనిస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడానికి కారణం.. వాళ్లని శశికళ తాలూకు మన్నార్‌గుడి మాఫియా నుంచి ఎంపిక చేసుకోవడమేనని వారు చెప్పారు అని వర్మ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా శశికళ ఫొటోతో కూడిన ఒక పోస్టర్‌ పోస్ట్‌ చేశారు.

ఈ సమయంలో జయలలిత స్ఫూర్తి మౌనంగా ఉండటం నాకు ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది అని వర్మ ట్విట్ చేశారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పటికీ … అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీపై తన పట్టును ఏమాత్రం సడలించలేదు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగురవేసినా, ఎమ్మెల్యేలు చేజారకుండా క్యాంపు రాజకీయాలను పక్కాగా నిర్వహించిన శశికళ… చివరకు తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. తద్వారా, పార్టీపై తన పట్టు జారకుండా జగ్రత్త తీసుకున్నారు. మరి ఈ సన్నివేశాలన్ని వర్మ తన సినిమాలో చూపిస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

- Advertisement -