లోకేష్ పై హేళన, జూ.ఎన్టీఆర్ పై గౌరవం

14
- Advertisement -

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఏపీ సీఎం జగన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాల్లోని మొదటి భాగం ‘వ్యూహం’.. ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంటే, సెకండ్ పార్ట్ ‘శపథం’.. మార్చి 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ, జూ.ఎన్టీఆర్ పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ రాంగోపాల్ వర్మ ఏం మాట్లాడాడు అంటే.. ‘జూ.ఎన్టీఆర్, తన తాత సీనియర్ ఎన్టీఆర్ కన్నా గొప్పోడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరి ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల్లో తారక్ పాత్ర కూడా ఉంటుందేమో చూడాలి. ఇక వ్యూహం ట్రైలర్లో లోకేశ్‌ను చూపించలేదు ఎందుకు ? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. నా దృష్టిలో లోకేశ్ దేవుడు. దేవుడిని కించపర్చకూడదు కాబట్టే చూపించలేదు. లోకేశ్ ఒక దివ్యత్వం ఉన్న వ్యక్తి అంటూ ఆర్జీవీ బదులిచ్చారు. పైగా వ్యూహం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నారా లోకేశ్‌కు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.

మీడియా మిత్రులు ఎవరికీ థ్యాంక్స్‌ చెప్పనని, తన ప్రియమిత్రుడు లోకేశ్‌కు థ్యాంక్స్‌ చెబుతానని అన్నారు. ‘ఇవాళ మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి ఆయనే కారణం. డిసెంబర్ లో సినిమా రిలీజై ఉంటే ప్రజలు మర్చిపోయేవారు. తెలివైన లోకేశ్ వ్యూహం పన్ని ఎన్నికల ముందు విడుదలయ్యేలా చేశారు’ అన్నారు ఆర్జీవీ. మొత్తానికి లోకేష్ ను కించపరుస్తూనే జూ.ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు ఆర్జీవీ.

Also Read:రైతు రుణమాఫీ జరిగేనా..అట్టకెక్కేనా?

- Advertisement -