- Advertisement -
నిన్నటివరకు ఎన్టీఆర్ బయోపిక్‌తో వార్తల్లో నిలిచిన వివాదస్పద దర్శకుడు రామ్‌గాపాల్ వర్మ తాజాగా మరోసారి పవన్‌పై సెటైర్లు విసిరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అసత్యం పలికాడని ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తినడం మానేశానని గతంలో ఓ సభలో పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యను పోస్ట్ చేసిన వర్మ.. ఇది సత్యాన్ని అపవిత్రం చేయడమేనని, ఇది విన్న వారి రియాక్షన్ ఇలా ఉందని చెబుతూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. పవన్..వ్యాఖ్యలకు కామెడీ కౌంటర్ ఇస్తూ వర్మ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
- Advertisement -