బాహుబలి-2 ట్రైలర్ వచ్చేసింది. కానీ ఇంకా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ రాలేదేంటీ..అనుకుంటున్నారా..? ఇక ఆ డైట్ కి పుల్‌స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే…సంచలన దర్శకుడు ఆర్జీవి ఆన్‌లైన్ లోకి వచ్చేశాడు. ఎక్కడ ఏం జరిగినా..ఆయనకి తెసిందంటే చాలు దాని పై స్పందించక మానడు. అది కూడా ఆయన అనుకుంటేనే..! అయితే తాజాగాబాహుబలి 2 ట్రైలర్ ఈ రోజు(గురువారం) రిలీజ్ అవడంతో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దానిపై తనదైన శైలిలో స్పందించాడు.

ట్రైలర్ రిలీజ్ అయిన కొంత సమయానికే సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ ట్రైలర్. అయితే ఈ ట్రైలర్ ని చూసిన వర్మ దానిపై మాట్లాడకుండా ఉండలేకపోయాడు. అందుకే తాను ఈ ట్రైలర్ గురించి ఏం అనుకుంటున్నాడో ట్వీట్ చేశాడు వర్మ. ఇది సినిమాలకు అమ్మలాంటి ట్రైలర్ కాదని, అమ్మమ్మలాంటిదంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.
ఇదే సమయంలో డైరెక్టర్ రాజమౌళిపై తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు వర్మ. మూవీని ఈ స్థాయిలో తీర్చిదిద్దిన జక్కన్నకి ‘మెగా బాహుబలి’ శాల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే..బాహుబ-2 ట్రైలర్ తో ఖుషీ అవుతన్న సిని లవర్స్ ఈ సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. మరి బాహుబలి-2 ట్రైలర్ లా..సినిమా కూడా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


