పబ్లిసిటీకి కేర్ ఆప్ అడ్రస్ రాంగోపాల్ వర్మ .. ఎప్పుడూ ఒక వివాదం లేదా సెన్సేన్ క్రియేట్ చేసే కామెంట్ చేసి వార్తల్లో ఉండటం ఈయన హాబీ. అది పండగ కావచ్చు, స్వాతంత్ర దినోత్సవం కావచ్చు.. ఒక మంచి సినిమా రిలీజ్ కావచ్చు.. ఒక బాంబ్ బ్లాస్ట్ కావచ్చు.. ఏదైనా సరే.. ఆ సంఘటనతో పాటు ‘వర్మ’ పేరు మారు మ్రోగాల్సిందే..
భారత బలగాలు పాక్‌లో సర్జికల్ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు చూపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై మండిపడుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఈ విషయమై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.
‘‘జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్ దాడులు చేయాలి. కేజ్రీవాల్ వేసుకునే మఫ్లర్ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాణ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్ పార్టీని ‘పాప్’(పాప్ అంటే పాపము) పార్టీగా మార్చాలి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.
గతంలో చిరు,పవన్,పలువురు సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి అభిమానుల నుంచి చివాట్లు తిన్నారు. ఐనా వెనక్కి తగ్గని వర్మ..తన ట్విట్ల పరంపర కొనసాగించాడు. ఇక టీచర్స్ డే సందర్భంగా వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఏ ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పనన్నారు. ఎందుకంటే తాను ఒక్క రోజు కూడా గురువులతో సంతోషంగా లేనని తెలిపారు.
సక్సెస్ ఫుల్ ఇంజినీర్స్, సక్సెస్ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. కాని, ఎక్కడైనా సక్సెస్ ఫుల్ టీచర్చ్ ఉన్నారా? కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తీసినట్లుగా ఎవరైనా ‘టీచర్ ఆప్ ది ఇయర్’ చేస్తే, అది ‘డిజాస్టర్ ఆప్ ది ఇయర్’ అవుతుంది అని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు చేసి విమర్శల పాలయ్యారు.