కేసీఆర్‌ గొప్ప నాయకుడు….

205
rgv praises Kcr
- Advertisement -

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణ ప్రారంభమైన దగ్గరి నుంచి ఎక్సైజ్ అధికారులతో పాటు విచారణ అధికారి అకున్ సబర్వాల్‌ని దర్శకుడు రాంగోపాల్ వర్మ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించిన ఆర్జీవీ తాజాగా మెతకబడ్డాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ ఓ అద్భుతమైన నాయకుడంటూ కితాబిచ్చారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారంతా దోషులు కాదని, కేవలం బాధితులు మాత్రమే అని కేసీఆర్ చెప్పడాన్ని వర్మ స్వాగతించారు. సమస్యను ముఖ్యమంత్రి సరిగా అర్థం చేసుకున్నారని కొనియాడారు. విచారణ సిబ్బందికి కూడా కేసీఆర్ విజన్ అవసరమని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అప్పుడే సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుందని సూచించాడు.

ఇదిఇలా ఉండగా నిన్న ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ని టార్గెట్‌ చేయలేదని…పారదర్శకంగా విచారణ జరుగుతోందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారు దోషులు కాదని బాధితులని చెప్పారు. డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి తరిమికొడతామని సీఎం చెప్పిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై వర్మ ప్రశంసలు గుప్పించారు.

rgv praises Kcr

- Advertisement -