సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ మూవీపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలీలో సెటైర్లు విసిరాడు. అజ్ఞాతవాసి సినిమాని చూసి తాను భయపడినట్టు పేర్కొన్నాడు. పవన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమా అయిన ‘పులి’ని చూసినట్టు ఉందని పేర్కొన్నాడు. కోరలు, పంజా లేని ఇలాంటి పులిని ఇప్పటి వరకు చూడలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.
అజ్ఞాతవాసి అతి పెద్ద డిజాస్టర్ అని పేర్కొన్న ఆర్జీవీ.. పవన్‌పై విరుచుకుపడుతున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌పై ప్రశంసలు కురిపించాడు. అజ్ఞాతవాసికి కత్తి ఇచ్చిన రివ్యూ వీడియోను తాను ఇప్పుడే చూశానని పేర్కొన్న వర్మ.. పవన్ కంటే కత్తి మహేశ్ చాలా అందంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
వర్మ తనను పొగడడంతో ఉబ్బితబ్బిబ్బయిన కత్తి ‘థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. కత్తి మహేశ్ పేరు వింటేనే రగిలిపోతున్న పవన్ అభిమానులు ఆర్జీవీ ట్వీట్‌పై మండిపడుతున్నారు. కత్తిని పొగడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ ఆర్జీవీని ఎండగడుతున్నారు.