వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. దసరాకు షూటింగ్ ప్రారంభం కానుండగా జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమాలో నటించేవారిని వెతికే పనిలో ఉన్న వర్మ…చంద్రబాబును పోలిన ఓ వ్యక్తి వీడియోని ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాదు ఈ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి లక్ష నజరాన ఇస్తానని ప్రకటించారు.
ఆర్జీవీ వెతుకుతున్న చంద్రబాబును పోలీన వ్యక్తి ఆచూకీని పంపించారు రోహిత్ అనే వ్యక్తి. ఈ విషయాన్ని ధృవీకరించారు ఆర్జీవీ. హే రోహిత్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా యూనిట్‌కు సీబీఎన్(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైకి నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం అని పోస్టు చేశారు.
Hey Rohit, thank u very much for gifting CBN to the unit of LAKSHMI’s NTR ..I will also put a credit thanking u in the beginning of the film ..For now please msg me ur account details for me to send you,your reward of 1 lakh #NTRTRUESTORY pic.twitter.com/EFRlWssG2A
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2018
అయితే చంద్ర బాబును పోలిన హోటల్ వెయిటర్ వివరాలను ఆర్జీవీ ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే, ఈ వ్యక్తి పేరు ప్రభు అని, గతంలో అతడు త్రయంబకేశ్వర్‌లోని హోటల్‌లో పనిచేసేవాడని తెలుస్తోంది.