టీడీపీ చీఫ్ చంద్రబాబు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ చిత్రంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాత్రి 11:30 గంటల తర్వాత సినిమా విడుదలను నిలిపివేస్తూ జస్టిస్ సూరేపల్లి నంద మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. విచారణను జనవరి 11కు వాయిదా వేశారు. అయితే, ఈ క్రమంలో థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ విడుదల చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ని జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. ఐతే, ‘వ్యూహం’ మూవీ సెన్సార్ రద్దైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వీటి పై ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. ‘వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదు. కోర్ట్.. CBFC నుంచి సర్టిఫికెట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లోపు సబ్మిట్ చెయ్యాలని అడిగారు’ అని ట్వీట్ చేశారు. మొత్తానికి ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. ఆర్జీవీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
Also Read:కాంగ్రెస్ వచ్చింది..కరెంట్ పోయింది