‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమా తెలంగాణలో విడుదలైందిగానీ, ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు నోచుకోలేదు. ఎలక్షన్ టైమ్ కావడంతో ఎన్నికలపై ఈ మూవీ ప్రభావం ఉంటుందని కొంతమంది హై కోర్టును ఆశ్రయించడంతో .. కోర్టు సినిమా విడుదలకు స్టే విధించింది. అయితే వర్మ సుప్రీమ్ కోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఆర్జీవీ తన బాధను రెండు పెయింటింగ్స్ రూపంలో తన ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.
ఒక పెయింటింగ్‌లో కోతి మెడకు సంకెళ్ళు వేసి ఉన్నాయి. దీనికి “నేను ఈ హైకోర్టు.. సుప్రీం కోర్టుల ఆలస్యంతో తీవ్రంగా అలసిపోయాను” అనే కామెంట్ పెట్టాడు. మరో పెయింటింగ్‌లో తల్లి కోతి గాయాలు తగిలిన పిల్లకోతిని అక్కున చేర్చుకొని ఓదారుస్తూ ఉంది. దీనికి క్యాప్షన్ గా “‘అమ్మ’ అర్జీవీ.. బిడ్డ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఓదారుస్తూ ఉందని చెప్తూ పెయింటర్‌ను ఒక ‘విజనరీ’ అంటూ ఆకాశానికెత్తేశాడు. పాపం వర్మ.. సరైన సమయంలో ఈ సినిమాను విడుదల చేయలేకపోయాననే అసంతృప్తిలో ఉన్నాడు.